తెలంగాణవీణ, కార్వాన్ : సబ్జీ మండి ఉప్పరబస్తీలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్త సమాజ గోవింద్ గురు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి పడి పూజ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములు 41 రోజుల దీక్షలో భాగంగా కన్య స్వామి సాయి, నందు కుటుంబ సభ్యులతో సబ్జీ మండి ఉప్పర్ బస్తీలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పడి పూజ నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అయ్యప్ప భక్తి పాటలు, పేటతుల్లి నృత్య ప్రదర్శన వచ్చిన భక్తులను మంత్రముగ్ధులను చేశారు.స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి శరణు ఘోషలతో ఉప్పర్ బస్తి మార్మోగింది.పడి పూజ అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన ప్రసాద (బీక్ష) వితరణ నిర్వహించారు. ఈ పడిపూజ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్త సమాజ సన్నిధాన మహా గురుస్వామి మోగిలి గోవిందసాగర్, గురు స్వామి శ్రీనాథ్ సాగర్, కునాల్, శత్రు సింగ్, కార్తీక్ ,పేరు స్వాములు కేమోజు శ్రీనివాస్, నాగేష్ ,రాజు, కన్య స్వాములు, సాయి నందు, మల్లికార్జున్, వెంకటేష్ ,రిషి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్ & ఉప్పర్ బస్తి అధ్యక్షులు ఆవు శెట్టి శ్యాంసుందర్ సాగర్, ప్రధాన కార్యదర్శి భవీన్ కుమార్, ఆకుల రాజు, గిరిధర్ సాగర్, ఆవుశెట్టి ప్రేమ్ సాగర్, ఆవుశెట్టి చిన్న, ఆకుల లకన్ మరియు స్థానిక బస్తీ వాసులు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్త సమాజ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ…
