తెలంగాణ వీణ/తార్నాక: నారాయణ పాఠశాలల స్పోర్ట్ మీట్ అత్యంత ఘనంగా నిర్వహించారు.కబడ్డీ, కోకో క్రికెట్,వివిధ క్రీడలు బాల బాలికలకు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన ఈస్ట్ జోన్ డిసిపి బాలస్వామి మాట్లాడుతూ… క్రిడల ద్వారా మానాసికోల్లాసం తో పాట, సోదర భావం పెంపొందుతాయి అని అన్నారు. అలాగే ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా అది గెలుపుకు నాందిగా మలచుకోవాలన్నారు. ఓలంపిక్స్ సెక్రటరి మల్లారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్హులే దేశ భవిష్యత్తు అని,మీరే సాంకేతిక సంపదగా మారాలని,నారాయణ యాజమాన్యం ఇలాంటి ఈవెంట్స్ నిర్వంచడం చాలా ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ జి ఎమ్ గోపాల్ రెడ్డి,ఏ జి ఎమ్ బాల పరమేశ్వరరావు, నారామణ జోన్ (ఎన్ జి) ప్ఫిన్సిపాల్స్్స, కోఆర్డినేటర్, ఉపాధ్యయ భృందం తదితరులు పాల్గోన్నారు.