యాప్రాల్ శ్మసనవాటికలోని సమాదులను కూల్చివేస్తున్నారు…
అభివృద్ది పేరుతో ఘొరీలను తొలగిస్తున్నవ్యక్తులపై చర్యలు తీసుకోవాలి …
యాప్రాల్ గౌడ సంఘం సభ్యుల డిమాండ్….
తెలంగాణవీణ , మల్కాజిగిరి ; యాప్రాల్ సర్వే నెంబరు 249లోని శ్మసనవాటికలోని తమ పూర్వికుల సమాదులను కొల్లగొట్టి మనోభావాలను దెబ్బతీస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యాప్రాల్ గౌడ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం యాప్రాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం ప్రతినిధులు మాట్లాడారు. యాప్రాల్ గీత కార్మికుల సంఘం అద్యక్షుడు వెంకటస్వామి, సభ్యులు బుడిద నర్సింహాగౌడ్ లు తమకు ఏలాంటి సమాచారం ఇవ్వకుండానే శ్మసన వాటికను అభివృద్ది చేస్తున్నామనీ చెప్పి శ్మసన వాటిన ప్రహారీ గోడను , తమ పూర్వీకుల ఘొరీలను తొలగించారనీ ఇదేమని అడిగితే దుర్భాషలాడుతూ, ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయమై పోలీసులకు తహసిల్ధార్ కార్యాలయంతో పాటు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఏలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కేవలం కల్లు సోసైటీకి మాత్రమే అధ్యక్షులై సంఘం సభ్యులనే బెదిరిస్తూ అరాచారం చేస్తున్నాడంటూ గౌడ సంఘం సభ్యులు ఆరొపించారు. సమాదులను కూల్చివేసి అభివృద్ది చేస్తున్నానంటూ ఒంటెద్దు పోకడలకు పాల్పడుతూ అదికారులను సైతం ఎక్కచేయకుండా వ్యవహరిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడి ప్రభుత్వ శ్మసన వాటికలో గౌడ సంఘం తో పాటు వివిధ కుల సంఘాలకు సంబంధించిన సమాదులున్నాయన్నారు. సోసైటీ డైరెక్టర్లను , కుల సంఘాల ప్రతినిధులను లెక్కచేయకుండా తమ పూర్వీకుల ఘొరీలను కూల్చి తమ మనోభావాలను దెబ్బతీస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షులు జగన్ గౌడ్, మండే నర్సింహాగౌడ్, వెంకటేష్ గౌడ్, రవిగౌడ్, నారాయణ, సాగర్, శ్రీకాంత్, భాస్కర్, శ్రవణ్, సంపత్, గిరి, సంతోష్, సువర్ణ, శోభారాణి, వికాస్, భరత్ , సూరీలు పాల్గొన్నారు.