తెలంగాణవీణ, కాప్రా : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయ హైస్కూల్ కాప్రాలో పలు కార్యక్రమాలను పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా “విద్యార్థులు వారి హక్కులు మరియు బాధ్యతలు” గురించి జిల్లా లీగల్ అథారిటీ సర్వీసెస్ కార్యదర్శి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు సీనియర్ జడ్జి శ్రీ డి. కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాఠశాలకు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థులు వారి హక్కులను పరిరక్షించుకొని సమాజంలో బాధ్యతగా గౌరవంగా మెలిగేటట్లు జీవించాలని కోరారు. ఎవరైనా చదువుకోకుండా ఉన్న 5 నుండి 15 సంవత్సరాల బాలబాలికలను బడిలో చేర్పించేందుకు 1098 నెంబర్ కి కాల్ చేసి బడిలో చేర్పించాలని సూచించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ శ్రీ కొప్పునూరి రాజేశ్వర్ మాట్లాడుతూ “నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు” విద్యార్థులందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీమతి వీణ,మల్కాజ్గిరి జిల్లా కోర్టు న్యాయవాదులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.