తెలంగాణ వీణ, గుంటూరు : 2026 అమరావతి గుంటూరు లో జరుగనున్న 3 వ ప్రపంచ తెలుగు మహాసభల “ముఖ్య సంచాలకులుగా” పెన్మత్స రామచంద్రరాజు నియమించినట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. భారతీయ విద్యా భవన్ ప్రాంగణం , గుంటూరు లో జరిగిన పాత్రికేయ సమావేశంలో నియామక లేఖలను పి.రామచంద్రరాజు కు, సహ సమన్వయకర్త వాసిరెడ్డి విద్యా సాగర్ లకు అందించారు. 3,4,5 జనవరి 2026 లో జరుగనున్న 3 వ ప్రపంచ తెలుగు మహా సభల విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పి. రామచంద్ర రాజు తెలిపారు. డా.కడిమిళ్ల వరప్రసాద్ సహస్రావధాని, రెడ్డప్ప ధవెజి, సింగం లక్ష్మీ నారాయణ, వడ్లమాని రవి, బాబుశ్రీ, అడ్డాల వాసు, అన్నాప్రగడ రవి, లఖ్హం రాజు సునీత, కంచర్ల ఆంజనేయులు, మెడికొండ శ్రీనివాస్ తదితరులు పాత్రికేయ సమావేశంలో పాల్గొన్నారు.