తెలంగాణ వీణ, సినిమా : తెలుగు సినీ పరిశ్రమలో విరామం లేకుండా వరుస సినిమాలు చేసే కథానాయకుల్లో హీరో నాని ఒకరు. కనీసం ఏడాదిలో తన రెండు సినిమాలు వుండే విధంగా ప్లాన్ చేసుకుంటారు ఈ యువహీరో. ఇటీవల ‘సరిపోదా శనివారం’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని ఈ సినిమా ఫలితం పట్ల సంతృప్తిగానే వున్నాడు. మిశ్రమ ఫలితం వచ్చిన నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ నేచురల్ స్టార్ శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్-3 సినిమా చేస్తున్నాడు. ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రానికి నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. కథ ప్రకారం సినిమా నేపథ్యం కూడా వైజాగ్‌లోనే కొనసాగుతుంది. కాగా అక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు నాని, శ్రీనిధి శెట్టిపై చిత్రీకరిస్తున్న సీన్స్‌ను కొంత మంది సందర్శకులు వీడియోలు తీశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో నాని సరసన కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తున్నారని తెలిసింది. ఈ నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం గ్లింప్స్‌లో నాని పాత్రను కూడా రివీల్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మే 1న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి మిక్కిజే.మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.