జర్నలిజం విలువలకు కట్టుబడి ఉండాలి… మోతె వెంకట్ రెడ్డి…
తెలంగాణవీణ, కాప్రా ; కాప్రా ప్రెస్ క్లబ్ ను గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు క్లబ్ లో ఉన్న మెజారిటీ సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతో ఎన్నికల అధికారి మోతె వెంకట్ రెడ్డి ప్రకటించారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఉల్లోజు శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా బి. విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా వేముల శంకర్, ఉపాధ్యక్షులుగా ఆదిమూలం శ్రీనివాస్,ఎండి అక్బర్, జి.గోపాల్ గౌడ్ ఏ. నటరాజ్ , కొశాధికారిగా రుద్రగోని నర్సింగ్ గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా బసంత్ రెడ్డి,శ్రీనివాస్ యాదవ్, సురేష్ , ప్రశాంత్,కార్యనిర్వహక కార్యదర్శులుగా వెంకట్, కార్యవర్గ సభ్యులుగా,రవి కిరణ్, ప్రధాన సలహాదారునిగా మోతె వెంకటరెడ్డి, సలహా దారులుగామెరుగు చంద్రమోహన్,టి.మల్కయ్య, జి. చంద్రమౌళి, జ్యోతిర్మయి చారి,సహదేవ చారి, కేసీ మోహన్, శ్రీనివాసరావు, కడియాల రమేష్ సత్యనారాయణ,శనిగరం అశోక్, సీర శ్రీనివాస్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జర్నలిస్ట్ మిత్రులందరూ జర్నలిజం విలువలకు కట్టుబడి పనిచేయాలని మోతె వెంకట్ రెడ్డి సూచించారు.