Sunday, December 22, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఇంద్ర మహిళా శక్తి పథకం.. కుట్టు కేంద్రం ప్రారంబించిన డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి..

Must read

హర్షం వ్యక్తం చేసిన తార్నాక డివిజన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ వేముల శ్రీనివాస్..

తెలంగాణ వీణ/తార్నాక:గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతే శోభన్ రెడ్డి తో కలిసి మనికేశ్వర్ నగర్‌లో ఇంద్ర మహిళా శక్తి పథకం కింద ఏర్పాటు చేసిన కుట్టు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మహిళా సాధికారతకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఇంద్ర మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు స్వావలంబనను సాధించడానికి, ఆర్థికంగా ఎదగడానికి సహకారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ, కుట్టు కేంద్రం ప్రారంభంతో స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడతాయని, తమ సొంత కాళ్లపై నిలబడడానికి ఈ పథకం దోహదం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిపిఓ శ్రీనాథ్ , శ్రీ వాణి, సెల్ఫ్ హెల్త్ గ్రూప్స్ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ తార్నాక డివిజన్ వర్కింగ్ ప్రసిడెంట్ వేముల శ్రీనివాస్, లింగయ్య, పవన్ కళ్యాణ్,బోదాస్ నరసింహ, మబ్బులు, ఇర్షాద్, గండికోట వెంకటేష్ అలాగే పలు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you