తెలంగాణవీణ, కాప్రా ; తెలంగాణ ఉద్య మకారుల ఫోరం మీడియా విభాగం రాష్ట్ర కోకన్వీనర్ గా… కాప్రా సర్కిల్ హెచ్ బీ కాలనీకి చెందిన దాసారం శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ గురువారం నియామక ఉత్తర్వులను శ్రీ నివాస్ కు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణఅమ రవీరుల ఆశయ సాధనకు తాన వంతు కృషి చేస్తానన్నారు. తనకు పదవీ బాధ్యతలు అప్పగించిన డాక్టర్ చీమ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.