తెలంగాణ వీణ/నాచారం: బ్రాహ్మణ సేవా వాహిని రాష్ట్ర కమిటీ సమావేశంలో ఫౌండర్ మరియు అధ్యక్షులు శేషం రఘు కిరణాచార్యుల అధ్యక్షత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా 2024 నూతన రాష్ట్ర వివాహిని కమిటీలో రాంపల్లి వంశీకృష్ణ శర్మ ( వేదం ,క్రమాంతం ) యువ వాహిని విభాగంలో ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు నియామిక పత్రాన్ని సభా పూర్వకంగా అందజేశారు. ఈ సందర్భంగా రాంపల్లి వంశీకృష్ణ శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణ శ్రేయసుకు, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బ్రాహ్మణ సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. త్వరలో సంఘం ద్వారా బ్రాహ్మణులకు వివిధ సేవా కార్యక్రమంలు విస్తరింప చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పతంజలి శర్మ, ప్రధాన కార్యదర్శి అభిషేక్ శర్మ, రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి భువనగిరి సందీప్ శర్మ , ఉపాధ్యక్షులు రాకేష్, సంయుక్త కార్యదర్శి రాఘవేంద్ర శర్మ, తదితరులు పాల్గొన్నారు.