తెలంగాణవీణ జాతీయం : క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన యోగ్‌రాజ్‌పై క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన్నుంచి సచిన్ తెందూల్కర్ కుమారుడు అర్జున్‌ను దూరంగా ఉంచాలని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేశారు. లేకపోతే యువకుడి భవిష్యత్తు నాశనమైపోతుందని కామెంట్లు చేస్తున్నారు. గతేడాది ఐపీఎల్‌లో ఆడిన తొలి తండ్రీకుమారులుగా సచిన్-అర్జున్ ఘనత సాధించిన సంగతి తెలిసిందే. అర్జున్‌ను ఉన్నత క్రికెటర్‌గా మార్చేందుకు అత్యుత్తమ శిక్షణ కోసం సచిన్ తన తండ్రిని కలిసినట్లు యువరాజ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇదే విషయాన్ని యోగ్‌రాజ్ కూడా తాజాగా ధ్రువీకరించారు.
‘‘బొగ్గుగనుల్లో డైమండ్‌ను చూస్తామా? విలువైన వజ్రంగా మారాలంటే సరైన వ్యక్తి చేతుల్లో పడాలి. అప్పుడే అమూల్యమైందిగా మారుతుంది. అలా కాకుండా దాని విలువ తెలియనివారి చేతికి వెళితే రెండు ముక్కలుగా చేసేస్తారు’’ అని యోగ్‌రాజ్ వ్యాఖ్యానించారు. దీంతో అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందించారు. దిగ్గజ క్రికెటర్లకు విలువ ఇవ్వని ఇలాంటి వ్యక్తి.. కుర్రాళ్లను ఎలా తీర్చిదిద్దుతారని విమర్శించారు.‘‘అర్జున్ కెరీర్ విషయంలో యోగ్‌రాజ్‌ను సచిన్ కలిసినట్లు నేను కూడా వార్తలు విన్నా. అదే నిజమైతే ఇంతకంటే ఆశ్చర్యకరం మరొకటి ఉండదు’’‘‘యోగ్‌రాజ్ వంటి వ్యక్తుల నుంచి అర్జున్ ఏం నేర్చుకోగలడు? భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చిన ఇద్దరు అత్యుత్తమ ప్లేయర్లను బ్యాడ్ చేయడమే ఆయన లక్ష్యం’’‘‘దయ చేసి.. ఎవరైనా యోగ్‌రాజ్ నుంచి అర్జున్ తెందూల్కర్‌ను పక్కకు తీసుకెళ్లండి. లేకపోతే ఇలాంటి ప్రవర్తనతో ఆ కుర్రాడి జీవితాన్ని నాశనం చేస్తారు’’ధోనీ, కపిల్‌ను యోగ్‌రాజ్ ఏమన్నారంటే? ధోనీ తన కుమారుడు యువరాజ్ సింగ్ కెరీర్‌ను నాశనం చేశాడని.. అతడిని ఎప్పటికీ క్షమించనని యోగ్‌రాజ్ వ్యాఖ్యానించారు. వరల్డ్ కప్ టోర్నీల్లో యువీ రాణించినా.. అతడికి తగినంత గుర్తింపు రాకపోవడానికి కారణం ధోనీనేనని విమర్శించారు. మరో నాలుగైదేళ్లు క్రికెట్ ఆడే అవకాశం యువీకి ఉందని, ధోనీ వల్లే త్వరగా ముగిసిందని ఆక్షేపించారు. ఇక కపిల్ దేవ్‌పైనా విమర్శలు గుప్పించారు. కేవలం ఒకే ఒక్క కప్ (వన్డే ప్రపంచ కప్ 1983) మాత్రమే సాధించాడని.. యువీ మాత్రం 13 మేజర్ టైటిళ్లను అందుకొన్నాడని యోగ్‌రాజ్ వ్యాఖ్యానించారు.