తెలంగాణవీణ ఏపీ బ్యూరో : కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం కడప స్టీల్‌ప్లాంట్‌పై ఏమాత్రం స్పందన లేకుండా వ్యవహరిస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తిచేయాలని వైఎస్‌ఆర్ జిల్లా కలెక్టర్‌కు ఆమె వినతిపత్రం అందజేశారు. మాజీ సీఎం జగన్ గత ఏడాది స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేసినా దాని గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. పరిశ్రమ ఏర్పాటుపై కాంగ్రెస్ తరఫున పోరాటం చేస్తామని చెప్పారు. ముంబయి నటి కాదంబరి జత్వానీ వ్యవహారంపైనా షర్మిల స్పందించారు. ఈ విషయంలో జగన్‌పై పలు విమర్శలు చేశారు. ఆమెను ఎలా కట్టడి చేయాలో జగన్, సజ్జన్ జిందాల్ ప్లాన్ చేశారని ఆరోపించారు.అక్రమంగా నిర్బంధించి ఆమెను తొక్కి పడేశారు‘‘సజ్జన్ జిందాల్, జగన్ మధ్య సాన్నిహిత్యాన్ని గొప్పగా చెప్పుకొన్నారు. జిందాల్‌కు ఎందుకు ఇన్ని కోట్లరూపాయల ఆస్తి కట్టబెట్టారో జగన్ సమాధానం చెప్పాలి. కాదంబరి జత్వానీ ఓ మహిళ యాక్టర్. ఆమెను మానసికంగా వేధించారు. ఒక మహిళను అడ్డుకునేందుకు ఇంత నీచంగా మారాలా?యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చి ఎదగాలని భావించిన మహిళను మానసికంగా వేధించారు. కేసు పెట్టబోతే అక్రమంగా నిర్బంధించి తొక్కి పడేశారు. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన మహిళను ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం దుర్మార్గం. జగన్‌కు తెలియకుండానే అప్పటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తారా? ఇద్దరు కుమార్తెలున్న జగన్.. జత్వానీకి జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదు? ఈ వ్యవహారంపై ఆయన సమాధానం చెప్పాలి. ఆమెకు అండగా ఉండి పోరాటం చేసేందుకు నేను సిద్ధం. గుడ్లవల్లేరు ఘటన.. ఫేక్ అని తేలింది
గుడ్లవల్లేరు కళాశాలలో హిడెన్ కెమెరాల ఘటన ఫేక్ న్యూస్ అని భావిస్తున్నాం. 300 కెమెరాలు పెట్టారని చెబుతున్నా.. ఎందుకు బయట పెట్టలేదు? ఒకవేళ షవర్‌లో పెట్టి ఉంటే నీళ్లు పడితే బ్లర్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మా టీమ్స్ వెళ్లి సర్వే చేస్తే అంతా ఫేక్ అని తేలింది. ఒకవేళ కెమెరాలు పెట్టినట్లు ఎవరైనా నిజాలు బయటికి తీస్తే బాధితుల తరఫున పోరాడతా’’ అని షర్మిల అన్నారు.