తెలంగాణవీణ సినిమా : నటి సాయిపల్లవి ఇంట శుభకార్యం జరిగింది. ఆమె సోదరి, నటి పూజా కన్నన్ వివాహం వేడుకగా జరిగింది. తన క్లోజ్ ఫ్రెండ్ వినీత్‌తో పూజ ఏడడుగులు వేశారు. ఈ వేడుకల్లో సాయిపల్లవి సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. సోదరితో కలిసి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన పలువురు నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సాయి పల్లవి డ్యాన్స్‌కు మరోసారి ఫిదా అయ్యామని కామెంట్స్ చేస్తున్నారు.సాయిపల్లవి సోదరిగా పూజ దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితురాలే. కోలీవుడ్ చిత్రం ‘చితిరై సెవ్వానం’తో నటిగా ఎంట్రీ ఇచ్చారు. 2021లో ఇది విడుదలైంది. పూజ నటనకు అంతటా ప్రశంసలు దక్కాయి. వినీత్‌తో పూజ ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారంతో ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం జరిగింది.