తెలంగాణవీణ జాతీయం :ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. గత కొన్ని నెలలుగా మహసి ప్రాంతంలోని ఈ జీవాల వరుస దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ తోడేళ్ల కోసం అధికారులు ముమ్మర వేట సాగిస్తున్నారు. ఇప్పటికే నాలుగు జీవాలను పట్టుకోగా.. మిగతా వాటికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారుల మూత్రంతో తడిపిన రంగుల బొమ్మలను వీటికి ఎరగా వేస్తున్నారు.మొత్తం ఆరు తోడేళ్లతో కూడిన గుంపు సంచరిస్తోందని గుర్తించిన అటవీశాఖ అధికారులు.. ‘ఆపరేషన్ భేడియాలో భాగంగా ఇప్పటివరకు నాలుగింటిని పట్టుకున్నారు. మిగతా రెండింటిని బంధించేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. రంగురంగుల టెడ్డీ బొమ్మలను చిన్నారుల మూత్రంతో తడిపి.. తోడేళ్లు విశ్రాంతి తీసుకుంటున్న డెన్లు, నదీ ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. మనిషి వాసనలా భ్రమింపజేసి వాటిని ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.‘‘ఈ తోడేళ్లు ఎప్పటికప్పుడు వాటి స్థావరాలను మారుస్తున్నాయి. రాత్రిపూట వేటకు వెళ్లి తెల్లారేసరికి గుహలను చేరుతున్నాయి. అందుకే వాటిని నివాసప్రాంతాల నుంచి తప్పుదారి పట్టించి.. ఉచ్చులు/బోనుల వైపు ఆకర్షించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. సాధారణంగా ఈ తోడేళ్లు చిన్నారుల పైనే ఎక్కువగా దాడులు చేస్తున్నాయి. అందుకే పిల్లలని భ్రమించేలా రంగుల బొమ్మలకు వారి దుస్తులు వేసి.. వాటిని చిన్నారుల మూత్రంతో తడిపాం. వీటితో పాటు థర్మల్ డ్రోన్లతో ట్రాక్ చేస్తున్నాం’’ అని డివిజినల్ అటవీశాఖ అధికారి అజిత్ ప్రతాప్‌సింగ్ మీడియాకు తెలిపారు.మరీ ఇంత ఘోరమా: పిల్లలను ఎస్‌ఐలను చేయడానికి.. పీఎస్‌సీ సభ్యుడే పేపర్ లీకర్‌గా..మరో చిన్నారి మృతి..ఓవైపు ఆపరేషన్ భేడియా కొనసాగుతుండగా.. తోడేళ్ల దాడులు మాత్రం ఆగట్లేదు. ఆదివారం రాత్రి జరిగిన వేర్వేరు దాడుల్లో ఓ మూడేళ్ల చిన్నారి మృతి చెందగా.. మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. దీంతో తోడేళ్ల దాడిలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో ఏడుగురు చిన్నారులే కావడం గమనార్హం.నక్కలకు ప్రాణసంకటం..ఇదిలాఉండగా.. యూపీలో తోడేళ్ల గుంపు వరుస దాడుల భయం బిహార్‌లో నక్కలకు ప్రాణసంకటంగా మారింది. ఈ రాష్ట్రంలోని మక్‌సుద్‌పుర్‌లో ఆదివారం తోడేలుగా భావించి ఓ నక్కను స్థానికులు కొట్టి చంపారు. ఈ ఘటనపై జంతు పరిరక్షణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.