తెలంగాణవీణ జాతీయం :రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం విభాగం రిలయన్స్ జియో కొత్త తరహా సేవలను ప్రారంభించింది. ఇంట్లోనే కూర్చొని సిమ్ యాక్టివేట్ చేసే సదుపాయం తీసుకొచ్చింది. అంటే ఇకపై జియో సిమ్ యాక్టివేషన్ కోసం జియో ఎగ్జిక్యూటివ్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదన్నమాట. ఐయాక్టివేట్ పేరుతో ఈ సేవలు తీసుకొచ్చినట్లు జియో తాజాగా ప్రకటించింది.రిలయన్స్ జియో ఇప్పటికే సిమ్ కార్డ్‌లను ఉచితంగా హోమ్ డెలివరీ చేస్తోంది. తాజాగా తీసుకొచ్చిన ఐయాక్టివేట్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా సిమ్ యాక్టివేట్ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తోంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ సాయంతో కార్డ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని కోసం యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ఓపెన్ చేయగానే ఐయాక్టివేట్ బ్యానర్ ప్రత్యక్షమవుతుంది. దానిపై క్లిక్ చేయగానే మీ పేరు, ఫోన్ నంబర్, పిన్ కోడ్ ఎంటర్ చేసి ఓటీపీని జనరేట్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేయగానే అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మీకు కావల్సిన ఆప్షన్ ఎంచుకొని ’ పై క్లిక్ చేయాలి. ఆధార్ ఓటీపీ లేదా డిజీలాకర్ సాయంతో కేవైసీ పూర్తి చేయాలి. ఇలా ఇంటికి వచ్చిన సిమ్‌ను మొబైల్ సాయంతో లైవ్ ఫొటో/వీడియో తీసుకొని, లైవ్‌లోనే డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదా డెలివరీ ఏజెంట్లు సాయంతోనూ ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. జియో వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేస్తే.. అదే రోజునే దాదాపు డెలివరీ అందిస్తోంది. అదనపు రుసుముతో నచ్చిన నంబర్‌తో సిమ్ కార్డ్‌లను అందిస్తోంది. ప్రస్తుతం ప్రీ పెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఆన్‌లైన్ వేదికగా ఫ్యాన్సీ నంబర్లు ఎంచుకొనే సదుపాయం కల్పిస్తోంది.