Sunday, December 22, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

న్యూస్ చానల్ ఎండీ నివాసంలో ఐటీ సోదాలు..

Must read

తెలంగాణ వీణ,హైదరాబాద్ : హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపాయి. తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు సిటీలో మొత్తం పదిచోట్ల సోదాలు చేపట్టారు. ఓ న్యూస్ చానల్ ఎండీ, ఫైనాన్స్ కంపెనీ యజమాని నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కూకట్‌పల్లి రెయిన్ బో విస్టాలో అద్దెకు ఉంటున్న బొల్లా రామకృష్ణ నివాసంలో రైడ్ జరుగుతోంది. బొల్లా రామకృష్ణ ఓ న్యూస్ చానల్ కు ఎండీగా వ్యవహరిస్తున్నారు.దీంతో పాటు ఆయనకు ఓ ఫైనాన్స్ కంపెనీ కూడా ఉందని సమాచారం. బషీర్ బాగ్‌లోని పైగా ప్లాజాలో ఉన్న ఆయన ఫైనాన్స్ కంపెనీ ఆఫీసులోనూ సోదాలు జరుగుతున్నాయి. సదరు బిల్డింగ్ లోని 2, 3, 4 అంతస్తుల్లోకి ఐటీ అధికారులు ఎవరినీ అనుమతించడంలేదు. దీంతో పాటు మొత్తంగా పదిచోట్ల అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you