తెలంగాణవీణ, దుండిగల్ : దుండిగల్ మల్లంపేటలోని ఓప్రైవేట్ పాఠశాల బస్సు కిందపడి నాలుగు సంవత్సరాల చిన్నారి మృతి చెందిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చొటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు…. మల్లంపేట గ్రామంలో కిరాణం షాపు నిర్వహించుకుని జీవనం సాగిస్తున్న రాజుకు ఇద్దరు కుమార్తెలు వీరు స్థానికంగా వుండే లీఫ్ స్కూల్ లో చదువుతున్నారు , రోజు మాదిరిగానో శుక్రవారం ఉదయం స్కూల్ కి వెళ్తుండగా స్కూల్ ఆవరణంలో బస్సు దిగిన బాలికలు పాఠశాలలోకి వెళ్తున్నారు. రాజు చిన్న కుమార్తె కుంట మన్విత లోపలకి వెళ్తుండగా స్కూల్ బస్సు ఢీ కొట్టింది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే తన కూతురు మృతి చెందిందంటూ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.