Thursday, September 19, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

పవన్‌ కల్యాణ్‌కు అల్లు అర్జున్ విషెస్‌ ఏమన్నారంటే:

Must read

తెలంగాణవీణ సినిమా :హైదరాబాద్‌ నటుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు నేడు. ఈసందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ఇందులోభాగంగా నటుడు అల్లు అర్జున్‌ తాజాగా విషెస్‌ తెలుపుతూ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు. ‘‘హ్యాపీ బర్త్‌డే పవర్‌స్టార్‌, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ గారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
‘‘ప్రజల కోసం నిరంతరం శ్రమించే జన హృదయ నేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, మన పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌కు జన్మదిన శుభాకంక్షలు’’ – రాఘవేంద్రరావు
‘‘గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన వ్యవస్థాపకులు పవన్‌కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై మీకున్న అంకితభావం, పట్టుదల అభినందనీయం. మీరు ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నా’’ – కిషన్‌రెడ్డి
‘‘గొప్ప స్నేహశీలిగా, మానవతావాదిగా ప్రజాసేవలో నిమగ్నమైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిన మీ ప్రస్థానం ఒక అధ్యాయం. రాజకీయ ప్రయాణంలో మీ సహనం, పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకం. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో మీరు వేసిన అడుగులు చరిత్రాత్మకం. ప్రజా నాయకుడిగా మీరు మరెన్నో పుట్టిన రోజులు చేసుకోవాలని, మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ – చంద్రశేఖర్‌ పెమ్మసాని
‘‘సంకల్పమే బలం, జనహితమే ధ్యేయంగా.. జన సంక్షేమం కోసం తపిస్తున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ కొండగట్టు ఆంజనేయస్వామి కృపతో ఎల్లప్పుడూ ప్రజా సేవలో తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ – బండి సంజయ్‌ కుమార్‌
‘‘వన్‌ అండ్‌ ఓన్లీ పవర్‌స్టార్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మరెన్నో విజయాలు అందుకోవాలని.. ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నా. వినయం, అంకితభావంతో మీరు భారీ విజయాన్ని అందుకున్నారు. ఇలాగే ప్రజల కోసం సేవ చేయాలని కోరుకుంటున్నా’’ – బన్నీ వాస్‌
‘‘ఈ పుట్టినరోజు నాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే జెండా పట్టిన జనసైనికులకు, నమ్మి నడిచిన నాయకులకు, నువ్వు వస్తే మార్పు తెస్తావ్ అని‌ ఎదురుచూసే నాలాంటి ఎంతోమందికి మర్చిపోలేని బహుమానం ఇచ్చిన ఏడాది కాబట్టి. ఉన్నత విలువలున్న వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు కాబట్టి మరీ ప్రత్యేకం. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు‌ జనసేనాని’’ – నాగబాబు
‘‘అందీ’ (తుపాన్‌) ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌.. ఎంతోమందిలో స్ఫూర్తి నింపిన నాయకుడు.. ఎన్నో లక్షల మంది ఆశాకిరణం.. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు హ్యాపీ బర్త్‌డే. కోట్లాది మంది ప్రేమ, ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’’ – మెహర్‌ రమేశ్‌
‘‘ఇతడే మన కళ్యాణ్ నుండి ఈయనే మన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరకూ ఎదిగిన మీ చరిత్ర అనితర సాధ్యం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ తీరు ఆచరణీయం. అన్నయ్య కు తమ్ముడిగా మొదలై లక్షలాది తమ్ముళ్ళకి అన్నయ్యగా మారిన మీరు ఇంతింతై వటుడింతే అన్నట్లు ఇంకా అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి కథానాయకుడిగా గెలిచి ప్రజల నాయకుడిగా నిలిచిన మీ జీవితం స్ఫూర్తి దాయకం. హ్యాపీ బర్త్‌డే పవన్‌కల్యాణ్‌’’ – ఎస్‌కెఎన్‌

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you