తెలంగాణవీణ, హైదరాబాద్ : రాష్ట్రంలో హత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై 1900 లైంగికదాడులు జరిగాయని చెప్పారు. ముఖ్యమంత్రి వద్దే హోం శాఖ ఉన్నప్పటికీ.. ప్రతి రోజూ 2 హత్యలు, 4 మానభంగాలు అన్నట్టుగా పరిస్థితి తయారయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావు నేతృత్వంలోని తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ముఠా గోపాల్‌తో కూడిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బృందం హైదరాబాద్ గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత కరువైందన్నారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో మహిళల రక్షణకు షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు.గత పదేండ్లు తెలంగాణను కేసీఆర్ అద్భుతంగా పరిపాలించారు. శాతిభద్రతలను పటిష్టంగా అమలు చేశారు. ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రతిష్ఠ మసకబారుతున్నదని చెప్పారు. స్మగుల్డ్ వెపన్స్ బయటపడుతున్నాయి. ఒకప్పుడు బీహార్‌లో ఉండే నాటు తుపాకులు.. తెలంగాణలో రాజ్యమేలుతున్నాయి. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని రాష్ట్రంలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. పోలీసులను ప్రభుత్వం పనిచేయనీయట్లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఫేక్ ఎన్‌కౌంటర్లు చేస్తున్నదని ఆరోపించారు.
వరద విపత్తు సహాయం అందించడంలో, లా అండ్ ఆర్డర్, రుణమాఫీ, విద్యా వ్యవస్థను నడిపించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. మొత్తానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడని విమర్శించారు. ఎంత సేపూ ప్రతిపక్షాలను వేధించడం, అక్రమ కేసులు పెట్టడం తప్ప పాలనను గాలికి వదిలేశాడన్నారు. మహిళను పరామర్శించడానికి సీఎం రేవంత్‌కు సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు. కాగా, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహిళలపై దాడులు జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి కనీసం స్పందించడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో మహిళలకు భద్రత లేదు, భరోసా లేదని విమర్శించారు.
Tweet9 నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై 1900 లైంగికదాడులు: హరీశ్ రావు pic.twitter.com/8gMeo5lGKn
— GS9TV Telugu News (@Gs9tvNews) September 6, 2024