తెలంగాణవీణ జాతీయం : ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌కు సుదీర్ఘకాలం పాటు సీఈఓగా సేవలందించిన సుశాన్ వొజ్కికి (56) కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడుతూ మృతి చెందారు. ఆమె మృతిపట్ల గూగుల్ పిచాయ్ విచారం వ్యక్తంచేశారు. ఇంటర్నెట్ ప్రపంచంలో యూట్యూబ్‌ను వీడియో అగ్రగామిగా నిలపడంలో వొజ్కికి కీలకపాత్ర పోషించారు. 1998లో గూగుల్ చేరిన ఆమె.. 2014 నుంచి 2023 వరకు యూట్యూబ్‌కు సీఈఓగా కొనసాగారు. ఆమె హయాంలో యూట్యూబ్ వేగంగా వృద్ధి చెందింది. యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ షార్ట్స్ వంటివి పురుడు పోసుకున్నాయి. 2023లో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. వొజ్కికి మరణం తీరని లోటని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. గూగుల్ చరిత్రలో ఆమెది కీలక పాత్ర అని, అమెలేని ప్రపంచాన్ని ఊహించలేకపోతున్నామని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తన స్నేహితురాలైన వొజ్కికి మరణం తనను ఎంతగానో కలచి వేసిందని, ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నట్లు పిచాయ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.