Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ట్రంప్‌ ‘ఇండియన్‌’ కామెంట్లు.. కమలా హారిస్‌ రివెర్స్ కౌంటర్‌:

Must read

తెలంగాణవీణ జాతీయం : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్‌ పార్టీ తరఫున సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పై మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ నోరుపారేసుకున్నారు. ఆమె ‘భారతీయురాలా?.. నల్లజాతీయురాలా?’ అంటూ ప్రశ్నించారు. తన జాతీయతను ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు హారిస్‌ దీటుగా బదులిచ్చారు. ఆయన మళ్లీ మళ్లీ పాత పాటే పాడుతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. అసలేం జరిగిందంటే..షికాగోలోని నేషనల్ అసోసియేషన్‌ ఆఫ్‌ బ్లాక్‌ జర్నలిస్ట్‌ల సదస్సులో ట్రంప్‌పాల్గొన్నారు. ఈసందర్భంగా కమలా హారిస్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. ‘‘ఆమె ఎల్లప్పుడూ భారతీయ వారసత్వానికి చెందినవారే. దాన్ని ఇన్నాళ్లూ ప్రచారం చేస్తూ వచ్చారు. ఆమె నల్లజాతీయురాలని కొన్నేళ్ల క్రితం వరకు నాకు తెలియదు. నాకు ఆ రెండింటిపైనా గౌరవం ఉంది. కానీ ఆమె ఉన్నట్టుండి నల్లజాతీయురాలిగా మారారు. ఆవిధమైన గుర్తింపును కోరుకుంటున్నారు. ఇంతకీ ఆమె భారతీయురాలా? నల్లజాతీయురాలా?’’ అని ట్రంప్‌ ప్రశ్నించారు. ఈ విమర్శలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.చర్చకు సిద్ధమా..! ట్రంప్‌నకు కమలా హారిస్‌ సవాల్‌ దీనిపై తాజాగా కమలా హారిస్‌ స్పందించారు. ‘‘ట్రంప్‌ మళ్లీ తన పాత విధానాలైన విభజన సిద్ధాంతం, అగౌరవపర్చే ధోరణినే ప్రదర్శిస్తున్నారు. అందుకే ఇలాంటివారు కాకుండా అమెరికా ప్రజలకు ఉత్తమమైన నాయకులు రావాలి. మన వైవిధ్యాలు మనల్ని విడదీయకూడదు. ఐకమత్యంగా ఉంచాలి. అదే మన బలం. వాస్తవాలను చెప్పాల్సి వచ్చినప్పుడు శత్రుత్వం, కోపంతో స్పందించేవారు మనకు వద్దు. వాస్తవాలను అంగీకరించి వాటిని ధైర్యంగా చెప్పే నాయకులు కావాలి’’ అని ఉపాధ్యక్షురాలు గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you