తెలంగాణవీణ సినిమా : ‘టైగర్ నాగేశ్వరరావు’ హం వేడుకగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి తంతులో పాల్గొన్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ వివాహానికి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఒక ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో రూపొందిన చిత్రమే ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో దీనిని తెరకెక్కించారు. నుపుర్ సనన్ గాయత్రీ భరద్వాజ్ అనుక్రీతి వాస్ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ‘టైగర్ నాగేశ్వరరావు’ కంటే ముందు వంశీ.. ‘దొంగాట’ను తెరకెక్కించారు.