తెలంగాణవీణ సినిమా :కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి బాలీవుడ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో బాలీవుడ్ మన దేశాన్ని తక్కువ చేసి చూపించిందన్నారు. తాను దేశం గర్వపడేలా సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్‌శెట్టి బాలీవుడ్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘కొన్ని భారతీయ సినిమాలు, ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి. మన చిత్రాలను గ్లోబల్ ఈవెంట్‌లకు ఆహ్వానిస్తారు. రెడ్ కార్పెట్ వేస్తారు. అందుకే నేను దేశం గురించి గర్వంగా మాట్లాడేలా చేయాలనుకుంటున్నా. నా దేశం.. నా రాష్ట్రం.. నా భాష.. వీటన్నిటి గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా’’ అని రిషబ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు ఆయన్ను విమర్శిస్తున్నారు. గతంలో ఆయన నటించిన కొన్ని సినిమాల్లోని సన్నివేశాలను షేర్ చేస్తున్నారు. తాజాగా రిషబ్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘కాంతార’లో ఆయన అద్భుతమైన నటనకు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిదని రిషబ్ శెట్టి అన్నారు. ఇంకా మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకుతీసుకురావడానికి కష్టపడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. అత్యంత గౌరవంతో ఆ అవార్డును కన్నడ ప్రేక్షకులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.