తెలంగాణవీణ సినిమా ; రామ్ చరణ్‌కు కొంచెం విరామం దొరికినా క్లీంకారతోనే సమయం గడుపుతారని నిహారిక (Niharika) చెప్పారు. ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లీంకార గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.‘‘క్లీంకార చాలా అల్లరి చేస్తుంది. ఇప్పటివరకు నేను చూసిన వాళ్లలో చరణ్ అన్న ప్రపంచంలోనే బెస్ట్ డాడీ. క్లీంకారకు అన్నం పెట్టడానికి ఎంతో కష్టపడతాడు. కుక్కపిల్లల్ని, పక్షుల్ని చూపించి తనకు అన్నం పెడతాడు. స్టార్ హీరోగా ఎంత బిజీగా ఉన్నా కుమార్తెతో సమయం గడుపుతాడు. అసలు అన్నని చూస్తే సినిమాలు లేకుండా కుమార్తెతో గడుపుతున్నాడా అనిపిస్తుంది. కానీ.. తను వర్క్‌లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటాడు. క్లీంకార మాకు గోల్డెన్ డార్లింగ్’ అని చెప్పారు. ఆ విషయంలో శ్రీదేవి – జాన్వీకపూర్ ఒక్కటే: బాలీవుడ్ నటుడు నిర్మాతగా వ్యవహరించడం గురించి మాట్లాడుతూ..‘కుటుంబం నుంచి నాకు మంచి సపోర్ట్ ఉంటుంది. చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి ఓటీటీలోకి వచ్చాను. ఇప్పుడు మంచి సినిమాకు నిర్మాతగా వ్యవహరించే అవకాశం వచ్చింది. కుటుంబకథా చిత్రాలు, మైథలాజికల్, కామెడీ సినిమాలు తీయాలనే ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుతానికి ‘కమిటీ కుర్రాళ్లు’ పైనే శ్రద్ధ పెట్టాను. ఇది ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇది విడుదలయ్యాక మిగతా కథలు వింటాను. ‘ముద్దపప్పు అవకాయ’ సిరీస్ కథ నేనే రాశాను. దానికి కూడా నిర్మాతగా వ్యవహరించాను’ అని అన్నారు.