తెలంగాణ వీణ/ సిద్దిపేట జిల్లా:శ్రావణంలోని వరలక్ష్మీ వ్రతం శుభ సందర్భాన్ని పురస్కరించుకొని టీ పొడిని ఉపయోగించి లక్ష్మీదేవి అపురూప చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపి తన ఆధ్యాత్మిక భక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు.ఈ సందర్బంగా మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నారు. మహిళలందరు కూడ వరలక్ష్మీ వ్రతాలలో పాల్గొని లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారన్నారు.