తెలంగాణవీణ సినిమా :అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప2 :ది రూల్’ శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించిన కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 100 రోజుల్లో అనగా డిసెంబర్ 6న ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా చిత్రబృందం ఒక పోస్టర్ షేర్ చేసింది. ‘‘మరో వంద రోజుల్లో అతడి రూల్ చూడనున్నారు. అద్భుతమైన అనుభూతిని పొందేందుకు సిద్ధంగా ఉండండి’’ అని టీమ్ పేర్కొంది. దీనిపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘వెయిటింగ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.మొదటి భాగానికి మించి ‘పుష్ప2 ఉంటుందని సుకుమార్ తెలిపారు. తొలి భాగంలో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు ‘పార్ట్2’తో సమాధానం ఇస్తామన్నారు. మరీ ముఖ్యంగా సిండికేట్‌తో పుష్పరాజ్ ఆడే గేమ్, ఎమోషనల్ సీన్స్, పుష్ప రాజ్ vs భన్వర్‌సింగ్ షెకావత్ మధ్య నడిచే డ్రామా ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తుందన్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన పాటలు ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. రష్మిక కథానాయికగా నటిస్తుండగా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీశ్ ప్రతాప్, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. డిసెంబరు 6న పాన్ ఇండియా స్థాయిలో ‘పుష్ప2: ది రూల్’ విడుదల కానుంది.