తెలంగాణ వీణ/తార్నాక: తార్నాకలో ప్రొ. కోదండరాంకి ఘన స్వాగతం పలికిన యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీమ్ పాష, విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్.
సుదర్శన్ రెడ్డి స్వీట్ హజ్ నుండి కోదండరాం ఇంటి వరకు బాణాసంచా కాల్చి బ్యాండులతో స్వాగతం పలికారు.
ప్రశ్నించే గొంతుక, తెలంగాణ ఉద్యమ రథసారథిని శాసనమండలికి వెళ్లడం ఉద్యమకారులందరికీ గర్వకారణం.
ప్రొ. కోదండరాంకి మరియు అమీర్ అలీఖాన్ కి ఏమ్మేల్సీలుగా అవకాశం కల్పించిన పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి కృతజ్ఞతలు.
ఈ కార్యక్రమంలో టీజేఏస్ యూత్ నాయకులు సుశీల్ కుమార్, రాజు, జాషువా, శివ, కిరణ్, నరేష్, నవాజ్, ఆర్టీసీ జేఏసీ నాయకులు లాలయ్య, సయీద్ తదితరులు పాల్గొన్నారు.