తెలంగాణవీణ జాతీయం : తెలివితేటలు పెంచుకోవాలంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా మెదడు చురుకుగా పనిచేయాలంటే కష్టమైన మార్గాల్ని ఎంచుకోవాలన్నారు. అప్పుడే సక్సెస్ వరిస్తుందని చెప్పారు. ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో నెటిజన్లతో ముచ్చటించే ఆయన.. తాజాగా ‘ఎక్స్’ వేదికగా కొన్ని సక్సెస్ టిప్స్‌ను పంచుకున్నారు. ఆ విషయాలు..కొత్త విషయాలపై ఆసక్తి: కొత్త విషయాలు నేర్చుకోవడం, అన్వేషించడం వల్ల మెదడు ఉత్తేజితమవుతుంది. తెలియని ప్రదేశాలకు ట్రావెల్ చేయడం వంటివి సరికొత్త అనుభవాలను అందిస్తాయి. మీతో మీకే సవాల్: కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. సౌకర్యాలను వదిలి అడుగు ముందుకువేయండి. ఇది మీలో ధైర్యాన్ని పెంచడమే కాకుండా సమస్యలను పరిష్కరించడానికి కావాల్సిన నైపుణ్యాలు మెరుగవుతాయి.అవుట్ ఆఫ్ ది బాక్స్: ఏ విషయం గురించైనా కొత్తగా ఆలోచించడం ప్రారంభించండి. వివిధ రకాల ఐడియాలు, కొత్త విధానాలు అమలుచేయడం, ఇతరుల కోణాల నుంచి సమస్యను పరిశీలించడం ద్వారా మీకు కొత్త ఆలోచనలు కలుగుతాయి. అది పురోగతికి దారితీస్తుంది.షార్ట్‌కట్స్ వద్దు: ఏదైనా సమస్యను పరిష్కరించేందుకు షార్ట్‌కట్స్ ఎంచుకోవద్దు. అప్పుడే మీ సామర్థ్యాలు బలోపేతం అవుతాయి. సంక్లిష్ట సమస్యల నుంచి లోతైన అవగాహన పెంచుకునేందుకు దోహదపడుతుంది.కొత్త వ్యక్తులను కలవండి: కొత్త వ్యక్తులను కలవడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవడం సాధ్యమవుతుంది. విభిన్న నేపథ్యం ఉన్న వ్యక్తులతో సంభాషించడం, వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకోండి. వృత్తిపరమైన, సామాజిక సమూహాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపండి.: