తెలంగాణవీణ సినిమా : నటుడు మహేశ్‌బాబు నమ్రత దంపతుల తనయుడు గౌతమ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా విషెస్ తెలుపుతూ ఇన్‌స్టాలో పోస్టులు పెట్టారు. గౌతమ్ విషయంలో తాను ఆనందపడుతున్నానని మహేశ్ పేర్కొన్నారు. ‘‘హ్యాపీ 18 మై సన్. ఈ సమయంలో ఎన్నో విషయాలు అన్వేషించు. ఎంజాయ్ చెయ్. లవ్ యూ. ఒక తండ్రిగా ఈరోజు నేనెంతో ఆనందంగా ఉన్నా’’ అని పోస్ట్ పెట్టారు. నమ్రత సైతం ఇన్‌స్టా వేదికగా విషెస్ చెప్పారు. ‘‘హ్యాపీ బర్త్‌డే మై సన్. నీ విషయంలో మేమెంతో ఆనందిస్తున్నాం. ఈ సమయం మనకు చాలా ప్రత్యేకమైనది. జీవితంలో నువ్వు ఇలాగే ప్రకాశించాలని కోరుకుంటున్నా. లవ్ యూ’’ అని తెలిపారు.తల్లిదండ్రుల తరహాలో గౌతమ్ యాక్టింగ్‌లో రాణించాలనుకుంటున్నాడు. ఇందులో భాగంగానే నటనలో శిక్షణ తీసుకునేందుకు న్యూయార్క్ యూనివర్సిటీకి వెళ్లాడు. దీనిపై మహేశ్ – నమ్రత కుమార్తె సితార ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘అన్నయ్య ‘1 నేనొక్కడినే’తో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అతను హీరోగా వెండితెరపై కనిపించే క్షణం కోసం ఎదురుచూస్తున్నా. దాదాపు నాలుగేళ్ల పాటు యాక్టింగ్‌లో శిక్షణ తీసుకోనున్నాడు. అతను తప్పకుండా మంచి నటుడు అవుతాడు. నేనూ యాక్టింగ్ స్కూల్స్‌కు వెళ్తున్నా’’ అని చెప్పారు.