Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఫ్యాన్స్‌ని ఉద్దేశించి మహేశ్‌బాబు ఆసక్తికర పోస్ట్‌:

Must read

తెలంగాణవీణ జాతీయం : తన అభిమానులను ఉద్దేశించి నటుడు మహేశ్‌బాబు ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. శుక్రవారం తన పుట్టినరోజుని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఆయన థాంక్యూ చెప్పారు. ‘‘నిన్న నా పుట్టినరోజు సందర్భంగా మీరు పంపించిన సందేశాలు, చూపించిన ప్రేమాభిమానాలు చూసి ఆనందంతో ఉప్పొంగిపోయా. మీరందరూ ఈ స్పెషల్‌ డేని నాకు మరింత ప్రత్యేకంగా మారేలా చేశారు. ప్రతి ఏడాది మీరు నాపై చూపిస్తోన్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. లవ్‌ యూ’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘లవ్‌ యూ అన్నా’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.మహేశ్‌బాబు పుట్టినరోజును పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారీ కటౌట్లు ఏర్పాటుచేసి కేకులు కట్‌ చేసి తమ ప్రేమను చాటుకున్నారు. మరోవైపు, మహేశ్‌ నటించిన ‘మురారి’ మూవీ నిన్న రీ రిలీజ్‌ అయ్యింది. ఈసందర్భంగా ఆయా థియేటర్ల వద్ద సినీప్రియుల సందడి కనిపించింది.ఇక, సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ఆరంభంలో ‘గుంటూరుకారం’తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు మహేశ్‌. ప్రస్తుతం ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌ కోసం సన్నద్ధమవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది. మహేశ్‌ 29వ చిత్రమిది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ‘మహారాజ్‌’అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాక్‌. వెండితెరపై సరికొత్త లుక్‌లో మహేశ్‌ కనిపించనున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you