తెలంగాణవీణ హైదరాబాద్ :బీసీ కులాల ఐక్యవేదిక మల్కాజ్గిరి అధ్యక్షుడు కామర్ల ఐలన్న. తెలంగాణ వీణ ,మల్కాజ్గిరి..
బీసీల అభ్యున్నతికి సర్దార్ గౌతు లచ్చన్న ఎనలేని కృషి చేశారని బీసీ కులాల ఐక్యవేదిక మల్కాజిగిరి నియోజకవర్గం అధ్యక్షుడు కామల్ల ఐలన్న అన్నారుగౌతు లచ్చన్న జయంతి సందర్భంగా శుక్రవారం భరత్ నగర్ లోని బీసీ భవన్ లో బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా ఐలన్న మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి గౌతు లచ్చన్న అని గాంధీ స్ఫూర్తితో స్వతంత్ర పోరాటంలో లచ్చన్న పాల్గొన్నారనిభారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి అని ఈ తరం రాజకీయ నాయకులంతా లచ్చన్నను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జీనుకుంట్ల రమేష్ కార్యదర్శులు కాసర్ల నాగరాజు, పిట్టల భాస్కర్ ,జోగు శ్రీనివాస్, గోపాల్ గౌడ్, బి లక్ష్మీనారాయణ, పేపర్ శ్రీనివాస్, శివ వెంకటేశ్వర్లు తదితరులు కలిసి నివాళులు అర్పించారు