తెలంగాణ వీణ, హైదరాబాద్ : రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోదరి కవితను గుర్తు చేసుకున్నారు. గతంలో తనకు కవిత రాఖీ కట్టిన ఫొటోను, అలాగే కవితను ఈడీ అరెస్ట్ చేసిన సమయంలో ఆమె పక్కన తాను నిలబడి ఉన్న మరో ఫొటోను షేర్ చేశారు. ఇవాళ నువ్వు రాఖీ కట్టలేకపోయినప్పటికీ నీకు అన్నగా ఎప్పటికీ అండగా ఉంటానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.