తెలంగాణవీణ సినిమా :‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో సితార్ పాటలో ఇటీవల చర్చనీయాంశమైన డ్యాన్స్ మూమెంట్ గురించి హరీశ్ శంకర్ స్పందించారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. పాటలో డ్యాన్స్‌ను ఫ్లోలో చూడాలన్నారు. స్క్రీన్ షాట్ తీసి చూడొద్దని కోరారు. ‘ఆ పాటను మొదటిరోజు చిత్రీకరణ చేశాం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఎప్పుడైనా పాటల్లో డ్యాన్స్‌ను ఫ్లోలో చూడాలి. అలాకాకుండా ఒక డ్యాన్స్ మూమెంట్‌ను స్క్రీన్ షాట్ తీసి చూస్తే ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. దాని రిహార్సిల్స్ చూసినప్పుడు నాకు కూడా ఈ పాటకు స్టెప్ అవసరం లేదనిపించింది. కానీ, శేఖర్ మాస్టర్ చాలా పెద్ద కొరియోగ్రాఫర్. ఆయన కంపోజ్ చేసిన మొదటి మూమెంట్‌ను నేను వద్దు అనడం భావ్యం కాదు. అందుకే దాన్ని కొనసాగించాం. సెన్సార్‌లో కూడా ఫ్లోలో చూశారు కాబట్టి ఓకే అయింది’ అని హరీశ్ శంకర్ చెప్పారు. తప్పుడు కామెంట్స్ పెట్టే వారిని, అసభ్య పదజాలాన్ని ఉపయోగించేవారిని మాత్రమే తాను సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తానన్నారు. తనకు నచ్చినట్టు రివ్యూలు ఇవ్వాలని ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. తన చిత్రం ఆబాలగోపాలాన్ని అలరించాలని కోరుకోవడం అత్యాశ అవుతుందన్నారు.రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రవితేజ యాక్షన్ మాస్ ప్రేక్షకులను మెప్పించగా.. భాగ్యశ్రీ బోర్సే అందాలకు యూత్ ఫిదా అవుతున్నారు. జగపతి బాబు కీలక పాత్రతో ఆకట్టుకున్నారు.