తెలంగాణవీణ , కాప్రా ; కాప్రా సర్కిల్ పరిధిలోని ప్రధాన రహాదారులకు ఇరువైవుల ఫుట్ పాత్ లు ఆక్రమణకు గురవుతున్నాయి. దీంతో ఇక్కడి రహాదారి నుంచి వచ్చిపోయే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని మౌలాలీ ఎస్పీనగర్ నుంచి ఇసీఐఎల్ వరకు, ఇసీఐఎల్ చౌరస్తా నుంచి చక్రిపురం, సైనిక్ పురి నుంచి ఇసీఐఎల్ వరకు , చక్రిపురం నుంచి చర్లపల్లి వైపు వెళ్లే రహాదారులన్ని అస్తవ్యస్థంగా మారుతున్నారు.రహాదారులకు ఇరువైపుల ఉన్న ఫుట్ పాత్ లను అక్రమణలకు గురికావటంతో పరిస్థితి మరింత జఠిలంగా మారుతోంది. నిత్యం వేలాధి వాహానాలతో ఇక్కడి రహాదారులన్నీ గజిబిజీగా ఉంటాయి. ఇక ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తొడు రోడ్లను, నాలాలను ఆక్రమించుకుని వ్యాపారులు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కుషాయిగూడ ప్రాధమిక ఆరోగ్యకేంద్రం పరిసరాల్లో రోడ్లను కబ్జా చేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. ట్రాఫిక్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో రహాదారులకు ఇరువైపుల ఉన్న ఫుట్ పాత్ లను నియంత్రించగలిగితే కొంతమేరకు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తోందని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. కాగా కుషాయిగూడ మెయిన్ రోడ్ లోని నాలా కబ్జా చేసి నాలా లోపల నుండి గోడ నిర్మాణం చేసి స్లాబ్ నిర్మాణం చేపడుతుంటే కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రోడ్లపైన నెలకొన్న నిర్మాణాలు శాశ్వతంగా తొలగించాలని ట్రాఫిక్ పోలీసులకు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులను కోరుతున్నారు. రోడ్లకు ఇరువైపుల వెలుస్తున్న షెడ్లను తొలగించాలని కుషాయిగూడ వెల్పేర్ ఆసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు.