తెలంగాణ వీణ, ఉప్పల్…. స్టమాక్ క్యాన్సర్ తో పోరాడుతున్న పేషెంట్ శ్రీనివాస్ అతని జీవిత భాగస్వామి గాయత్రి డిఎఫ్ ఎన్ఎస్ సంస్థ గురించిన వార్తలను తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన డిఎఫ్ఎన్ ఎస్ ఆర్గనైజేషన్ గ్రూప్ సభ్యులు ఒక స్టాండ్ తీసుకొని ఆర్థిక సహాయం మద్దతును అందించారు. రెడ్డి హిల్స్ లోని ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితుడికి ఆర్థిక సహాయాన్ని అందించారు. డీఎఫ్ఎఎన్ఎస్ గ్రూప్ సభ్యులు దీపక్ వర్మ, నజీబ్, నర్సింగ్, శేఖర్, ఆనంద్, సాయిలు,రాజేశ్వరీ,దత్తు,శివ,నాగరాజ్,బాలకృష్ణ,రవీందర్,సాయి,అర్షద్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపక్ వర్మ మాట్లాడుతూ ఇప్పటివరకు నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలను అందించామని తెలిపారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న తాము ఐక్యమత్యంతో ఉంటూ ప్రతినెలా జీవితంలోని కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటామని తెలిపారు.