తెలంగాణవీణ, కాప్రా ; నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని కాప్రా డిప్యూటీ కమిషనర్ ముకుందారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సర్కిల్ పరిధిలోని కమలానగర్ లోని అక్రమ నిర్మాణాన్ని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సిబ్బందితో కలిసి కూల్చివేతలు చేపట్టారు. అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపిక్షించేది లేదన్నారు.
అయితే నిర్మాణం పూర్తి స్థాయిలో చేపడితే తప్ప అధికారులకు అక్రమ నిర్మాణం గురించి తెలియలేదా ? ప్రారంభ దిశలోనే నిర్మాణాన్ని అడ్డుకోవాల్సింది పోయి పూర్తయే వరకు అధికారులకు ఇక్కడి అక్రమనిర్మాణం గురించి తెలియకపోవటం శోచనీయమనీ పలువురు విమర్శిస్తున్నారు.
షెడ్ల నిర్మాణాలపై చర్యలేవి…..
కాప్రా సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ షెడ్ల నిర్మాణాలు విచ్ఛల విడిగా కొనసాగుతున్న వాటిని అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నానే విమర్శలున్నాయి. సర్కిల్ పరిధిలోని గురురాఘవేంద్రకాలనీ, గాంధీనగర్, పద్మశాలి టౌన్ షిప్, కందిగూడ ప్రాంతాల్లో వెలుస్తున్న షెడ్లపై అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం పట్ల అంతర్యమేమిటోననే ఇట్లే అవగతమైతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. అధికారులు నాయకుల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు , షెడ్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ణప్తి చేస్తున్నారు.