తెలంగాణవీణ జాతీయం : టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఛార్జీలను పెంచడంతో అందరి చూపు ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) మీద పడింది. తక్కువ ధరకే ప్లాన్లు అందిస్తుండడంతో చాలామంది ఈ నెట్‌వర్క్‌కు మారుతున్నారు. మరోవైపు 4జీ నెట్‌వర్క్ సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు బీఎస్ఎన్‌ఎల్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తమ నెట్‌వర్క్‌కు మారాలనుకొనేవారికి ఆన్‌లైన్‌లోనే సులువుగా నచ్చిన నంబర్‌ను ఎంపిక చేసుకొనే సదుపాయం కల్పిస్తోంది.
ఆన్‌లైన్‌లో ఇలా..
మీకు అందుబాటులో ఉన్న సెర్చ్ ఇంజిన్‌లో ‘‘BSNL Choose Your Mobile Number’’ అని సెర్చ్ చేయాలి.
కింద కనిపించే వెబ్‌పేజెస్‌లో ‘‘cymn’’ పై క్లిక్ చేసి.. మీ జోన్, రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.
నచ్చిన నంబర్‌ల కోసం వెతికేందుకు ప్రత్యేక ఆప్షన్లను తీసుకొచ్చింది. అందులో ‘‘search with series, start number, end number, sum of numbers’’ అని నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి.
ఫ్యాన్సీ నంబర్ కోసం పక్కనే ఫ్యాన్సీ నంబర్ ట్యాబ్ కూడా ఉంటుంది.
వీటిలో ఒక ఆప్షన్‌ను ఎంచుకొని మీకు నచ్చిన అంకెలను ఎంటర్ చేసి ‘search’పై క్లిక్ చేయాలి.
మీరు ఎంటర్ చేసిన నంబర్ ఆధారంగా కొన్ని ఫోన్ నంబర్లను చూపుతుంది.
అందులో నచ్చిన నంబర్ ఎంచుకున్నాక దాన్ని రిజర్వ్ చేసుకొనేందుకు ‘Reserve Number’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయగానే మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే మీరు ఎంచుకున్న నంబర్ రిజర్వ్ అవుతుంది.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక మీ దగ్గరలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్‌కు వెళ్లి సిమ్ కార్డ్ తీసుకోవచ్చు