తెలంగాణవీణ జాతీయం :పశ్చిమబెంగాల్‌లో హత్యాచార ఘటన వేళ.. ఆర్‌జీ కార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ (Sandip Ghosh) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయనపై కోల్‌కతా పోలీసులు అవినీతి కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలో ఆర్థిక అవకతవలపై జూన్‌లో ఫిర్యాదు నమోదైనట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. అప్పటినుంచి దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారని పేర్కొన్నాయి.ఇదిలాఉంటే.. ఈ ఘటన జరిగిన ఆర్‌జీ కార్ ఆసుపత్రికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను పరిశీలించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక సిట్‌ను ఏర్పాటుచేసి అధిపతిగా ఐజీ ప్రణవ్ కుమార్‌ను నియమించింది. నెలలోగా తొలి నివేదిక సమర్పించాలని కోరింది. ఈ క్రమంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.