తెలంగాణవీణ ఏపీ బ్యూరో : బాపట్ల రైల్వే స్టేషన్‌లో మతి స్థిమితం లేని బాలుడు హల్‌చల్ చేశాడు. గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ బాపట్ల రైల్వే స్టేషన్‌కు రాగానే.. అప్పటికే ఫ్లాట్‌ఫాంపై ఉన్న బాలుడు ఒక్కసారిగా ఇంజిన్ బోగిపైకి ఎక్కాడు. అనూహ్య ఘటనతో నివ్వెరపోయిన రైల్వే యంత్రాంగం వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రైల్వే పోలీసులు రంగంలోకి దిగి అతి కష్టం మీద అతన్ని కిందకు దించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో దాదాపు 20 నిమిషాల పాటు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను బాపట్లలో నిలిపివేశారు. రైల్వే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో బాలుడికి పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. అతని వద్ద ఆధార్ కార్డు లభ్యం కావడంతో వివరాలు సేకరించేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని బాలసదన్‌కు తరలించారు.