Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

‘ఏ పనీ చేయకపోయినా ₹3 కోట్లు’ అమెజాన్‌ ఉద్యోగి పోస్ట్‌ వైరల్‌:

Must read

తెలంగాణవీణ జాతీయం : కంపెనీలో కష్టపడి పనిచేసే వారు కొందరైతే.. వచ్చామా పోయామా అన్నట్లు ఉండేవారు మరికొందరు. పని గంటలకు మించి చేసే వారు కొందరైతే.. ఉన్న పని గంటల్లో టైమ్‌ పాస్‌ చేసేవారు ఇంకొందరు. ఎంత పనిచేసినా గుర్తింపు రావడం లేదనే బాధపడుతున్న ఈ రోజుల్లో.. తనకు పనీపాటా లేకపోయినా రూ.3 కోట్లు పైనే ఆర్జించానంటూ చెప్పుకొచ్చాడో ఉద్యోగి. తన ‘ఘన’కార్యాన్ని తానే స్వయంగా ఓ పోస్టులో రాసుకొచ్చాడు. దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది.అమెజాన్‌లోని సీనియర్‌ ఉద్యోగి ఒకరు బ్లైండ్‌ అనే ప్లాట్‌ఫామ్‌లో ఇటీవల ఓ పోస్ట్‌ పెట్టాడు. గూగుల్‌ తనకు ఉద్వాసన పలికాక ఇక్కడ చేరానని అందులో పేర్కొన్నాడు. సీనియర్‌ టెక్నికల్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా గడిచిన ఏడాదిన్నర కాలంలో సుమారు 3.70 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.3.10 కోట్లు ఆర్జించినట్లు పేర్కొన్నాడు. కంపెనీలో ఏ పనీ చేయకపోయినా తనకు మొత్తం వచ్చిందని పేర్కొన్నాడు. ‘ఎంతకాలమో ఈ అదృష్టం!’ అంటూ రాసుకొచ్చాడు.వాస్తవానికి గూగుల్‌ తనను ఉద్యోగం నుంచి తొలగించినప్పుడే ఏ పనీ చేయకూడదన్న ఉద్దేశంతోనే అమెజాన్‌లో చేరినట్లు చెప్పాడు. అంతేకాదు అమెజాన్‌లో కేవలం ఏడంటే ఏడే సపోర్ట్‌ టికెట్లను మాత్రమే పరిష్కరించాడట. ఓ సింగిల్‌ ఆటోమేటెడ్‌ డ్యాష్‌బోర్డునూ రూపొందించినట్లు చెప్పాడు. ఇందుకోసం మూడు నెలల సమయం వెచ్చించినట్లు కంపెనీకి పేర్కొన్నాడు. వాస్తవానికి ఈ పనిని చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేసినట్లు తన పోస్టులో చెప్పుకొచ్చాడు. 8 గంటల పని గంటల్లో ఎక్కువ సమయం వెచ్చించిందీ ఏదైనా ఉందీ అంటే అది మీటింగ్‌లకేనని పేర్కొన్నాడు.ఆ ఉద్యోగి చేసిన పోస్ట్‌ను ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై నెట్టింట చర్చ మొదలైంది. దీంతో చాలా మంది ఆ ఉద్యోగి తీరును తప్పుబట్టారు. కష్టపడి పనిచేసి సంపాదించాలన్న వ్యవస్థలను ఇలాంటి వ్యక్తులే నాశనం చేస్తున్నారంటూ ఓ యూజర్‌ మండిపడ్డారు. కార్పొరేట్‌ వ్యవస్థలోనే ఈ లోపం ఉందంటూ మరో వ్యక్తి కామెంట్‌ చేశాడు. పని ప్రదేశంలో ఎంతో విలువైన సమయాన్ని వృథా చేశాడంటూ మరో యూజర్‌ విమర్శలు గుప్పించాడు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you