తెలంగాణవీణ, యాదాద్రి : తిరుమల తరహాలో యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహులను దర్శించుకునే ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. గర్భగుడిలోని నారసింహుడిని మహాముఖ మండపంలో 26 అడుగుల దూరంలో ఉన్న వేదికపై నుంచి దర్శించుకోవచ్చని ఆలయ ఈవో భాస్కర్‌రావు వెల్లడించారు. రూ.150 శీఘ్ర, ధర్మ దర్శన మార్గాలు గర్భగుడి వద్దకు చేరుకునే విధానంలో మార్పు తెచ్చి ఆ వరుసల్లోని భక్తులను కొత్తగా ఏర్పాటైన వేదిక పైనుంచి పంపిస్తారు. కొత్తగా నిర్మితమైన అన్నప్రసాద సముదాయంలో నిత్యం 5 వేల మంది భక్తులకు అన్నప్రసాద సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎంపీ, ఎమ్మెల్యే వెల్లడించారు.