- ఒక్కసారిగా పేలిపోయిన బాయిలర్
- 20 మంది కార్మికులకు గాయాలు
- ఐదుగురి పరిస్థితి విషమం
ఎన్టీఆర్ జిల్లాలోని బోదవాడలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. బాయిలర్ పేలి 20 మంది కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ కు చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రులను విజయవాడ, జగ్గయ్యపేట ఆసుపత్రులకు తరలించారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై జిల్లా కలెక్టర్ సృజన స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు నిర్దేశించారు. కాగా, గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.