తెలంగాణవీణ జాతీయం : ఉత్తరప్రదేశ్‌లో చండీగఢ్-డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. గోండా సమీపంలో గురువారం మధ్యాహ్నం 2.35 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొన్ని బోగీలు పట్టాలు తప్పగా.. మరికొన్ని పూర్తిగా బోల్తా పడినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.