Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

వామ్మో బోసి నవ్వులు లేవ్‌.. పుట్టుకతోనే శిశువుకు 32 పళ్లు..! వీడియో వైరల్‌

Must read

తెలంగాణవీణ జాతీయం ; అప్పుడప్పుడే కళ్లు తెరుస్తూ.. బోసి నోటితో పాల కోసం ఎదురుచూస్తుంటారు తల్లిగర్భం నుంచి భూమి మీదకొచ్చిన పసికందులు. రోజులు గడుస్తున్నకొద్దీ వారి బోసినవ్వులతో మురిపిస్తుంటారు. నెలలు గడిచిన తర్వాత ఒక్కొక్కటిగా పాలదంతాలు వస్తుంటాయి. కానీ ఓ చిన్నారి విషయంలో మాత్రం సీన్ రివర్స్‌. పుట్టినప్పుడే నోటినిండా 32 పళ్లను చూసి, ఆ తల్లిదండ్రులు షాక్‌ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దానిని ఆ చిన్నారి తల్లి షేర్ చేసింది.ఈ వీడియోలో కనిపిస్తోన్న దృశ్యాల్లో పుట్టకతోనే పాపకు నోటినిండా పళ్లు ఉన్నాయి. పుట్టినప్పటినుంచి రోజులు గడుస్తున్నకొద్దీ ఆ చిన్నారి ఎలా ఉందో అందులో చూపించారు. అవగాహన కోసమే దానిని షేర్ చేసినట్లు చెప్పారు. ఇలాంటి ఒక ఆరోగ్య పరిస్థితిని ‘నాటల్ టీత్’ అంటారు. దీనివల్ల ఆ బిడ్డకు అంతగా ప్రమాదం లేకపోయినా.. పాలిచ్చేటప్పుడు తల్లికి ఇబ్బంది అవుతుంది. అలాగే ఏదైనా పన్ను విరిగితే.. దాన్ని ఆ చిన్నారి మింగే అవకాశమూ ఉంటుంది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. ‘‘బేబీ ఆరోగ్యం బాగుందా..? ఎదుగుతున్నప్పుడు ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా..?’’ అని కొందరు ప్రశ్నించారు. ఆ వీడియోకు రెండు కోట్లకుపైగా వీక్షణలు వచ్చాయి. అయితే తర్వాత ఆ పాప పళ్లను వైద్యులు తొలగించినట్లు తెలుస్తోంది.

Nika Diwa | one smile at a time. #newborn | Instagram

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you