Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

పాముకాటుతో ఏటా 50 వేలమంది మృతి.. భారత్‌లోనే అత్యధికం:

Must read

తెలంగాణవీణ జాతీయం : దేశంలో పాము కాటు మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏటా దాదాపు 50 వేల మంది ఈ కారణంగానే మన దేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పాముకాటు మరణాల్లో అత్యధికం భారత్‌లోనే చోటుచేసుకున్నట్లు లోక్‌సభలో భాజపా ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ వెల్లడించారు.‘‘ప్రతి ఏడాది మన దేశంలో 30-40 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. ఇందులో 50 వేల మంది చనిపోతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశం. ఇక బిహార్‌ పేదరికంతోపాటు.. ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది’’ అని ఎంపీ రూఢీ లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. చాలా పాము కాటు మరణాలను నివారించవచ్చని.. వాతావరణ మార్పులు కూడా దీనిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆయన వివరించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you