ప్రజా సంక్షేమమే లక్ష్యం: ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి
తెలంగాణ వీణ, మేడ్చల్ 3 : ప్రజా సంక్షేమమే లక్షంగా అనుక్షణం పని చేసిన నాయకులకు ప్రజాధరణ ఎప్పుడు ఉంటుందని మాజీ మంత్రి,
మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్ పేట్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరై జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ ల పదవి కాలం ముగియడంతో వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాయకీయాల్లో ఎన్నో ఓడిదోడుకులు, అటుపోట్లు ఉంటాయన్నారు. వాటిని ఆదిగమించి ప్రజలకు సూపరిపాలన అందించినప్పుడు ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు ఎల్లుభాయి బాబు, హారిక మురళీగౌడ్, జడ్పీటీసీలు అనితలాలయ్య, హరివర్ధన్ రెడ్డి, వైస్ ఎంపీపీ లు శ్రీనివాస్ రెడ్డి, సుజాత తిరుపతి రెడ్డి, కో అప్షన్ సభ్యులు ముజీబ్, గౌస్ పాషా, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఎంపీడీఓ లు వస్తలాదేవి, మమతాభాయి, తహసీల్దార్ వెంకట నర్సింహారెడ్డి, యాదగిరి రెడ్డి, ఎంఈఓ వసంత కుమారి, వ్యవసాయ అధికారి రమేష్, సూపరింటిండెంట్ సంపత్ కుమార్, ఎంపీటీసీలు , అధికారులు, నేతలు నర్సింహా రెడ్డి( బిఎన్ఆర్ ), జగదీష్ గౌడ్, శివవీర ప్రసాద్, మోహన్ రెడ్డి, హనుమాన్ దాస్, భూమి రెడ్డి, యాదగిరి, బాలు, వెంకటేష్, అశోక్, సిబ్బంది పాల్గొన్నారు, జడ్పీటీసీ అనిత లాలయ్య తమపై నమ్మకంతో గెలిపించి 5 సంవత్సరాలు అందరించిన ప్రజలకు, అధికారులకు,పార్టీలనేతలకుజీవితాంతంరుణపడిఉంటాను. ప్రజాసమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించిన ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలే దేవుళ్ళు : ఎంపీపీ ఎల్లుభాయి బాబు
ప్రజాక్షేత్రం లో ప్రజలు, ఓటర్లే దేవుళ్లు. వారి సంక్షేమమే ధ్యేయంగా పాలకులు పని చేయాలి. ప్రజాధరణ, అధికారుల సహకారం తో ప్రజలకు తోచిన సేవచేసుకున్నాను. నా వలన తెలిసి తెలియక ఇబ్బందులు, భాధలు కలిగింటే పెద్దమనస్సుతో మనించాలని కోరారు.