తెలంగాణవీణ, హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-2, 3 పరీక్షలను రీషెడ్యూలు చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ‘ఈ రెండు సర్వీసుల పరీక్షలను కమిషన్ వాయిదా వేసినట్లు వెబ్ నోట్ సర్క్యులేట్ అవుతోంది. గ్రూప్-2 పరీక్షలు నవంబరు 17, 18న, గ్రూప్-3 పరీక్షలు నవంబరు 24, 25వ తేదీకి మార్చారంటూ టీజీపీఎస్సీ పేరిట కొందరు నకిలీ వెబ్‌నోట్ సృష్టించి, వాట్సప్ గ్రూపుల్లో ప్రచారం చేశారు. ఈ నకిలీ సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దు’ అని కమిషన్ తెలిపింది.