తెలంగాణవీణ జాతీయం : భారత మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ పారిస్ ఒలింపిక్స్‌లో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. 75 కేజీల విభాగం రౌండ్ 16 మ్యాచ్‌లో తిరుగులేని విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకుంది. 5-0 తేడాతో సునీవా (నార్వే)పై అలవోకగా విజయం సాధించింది. ఆమె ఆగస్టు 4న మధ్యాహ్నం 3:02 గంటలకు క్వార్టర్స్‌లో లి కియాన్ (చైనా)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో లవ్లీనా నెగ్గితే భారత్‌కు మరో పతకం ఖాయమవుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ప్రీక్వార్టర్స్‌కు దీపిక ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి రౌండ్ 16కు దూసుకెళ్లింది. రౌండ్ 64 మ్యాచ్‌లో 6-5 తేడాతో రీనా (ఎస్తోనియా)పై నెగ్గిన దీపిక.. రౌండ్ 32 మ్యాచ్‌లో 6-2తో తేడాతో క్వింటీ రోఫెన్ (నెదర్లాండ్స్)పై గెలుపొందింది. మరోవైపు, మహిళల ట్రాప్ క్వాలిఫికేషన్‌లో భారత షూటర్లు నిరాశపర్చారు. రాజేశ్వరికుమారి 22వ స్థానంలో, శ్రేయసింగ్ 23వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈక్వెస్ట్రియన్‌లో అనూష్ అగర్వాలా కూడా ఆకట్టుకోలేకపోయాడు. వ్యక్తిగత డ్రెసెజ్ గ్రాండ్ ప్రీ విభాగంలో తొమ్మిదో స్థానంలో నిలిచి రేసు నుంచి ఎలిమినేట్ అయ్యాడు.