తెలంగాణవీణ ఏపి బ్యూరో : రొట్టెల పండుగ ప్రారంభమైంది. బారాషహీద్ దర్గా వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. ఊరించే వరాల రొట్టెను అందుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం కోర్కెల రొట్టెలు పంచుకున్నారు. బారాషహీద్‌లకు గలేఫ్‌లు, పూల చద్దర్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రాకతో స్వర్ణాల చెరువు ఘాట్, దర్గా ఆవరణలో సందడి నెలకొంది. 5 వేల మంది సిబ్బంది రొట్టెల పండుగ విధుల్లో ఉన్నారు. భద్రతా విధుల్లో 2 వేల మంది పోలీసులను నియమించారు. ఈ రొట్టెల పండుగ ఐదు రోజుల పాటు జరగనుంది.