తెలంగాణవీణ ఏపీ బ్యూరో :మాజీ సీఎం వైఎస్ జగన్‌పై సామాజిక మాధ్యమాల్లో జనసేన నేత నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్‌కు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని ఎద్దేవా చేశారు. ‘‘ఎందుకంటే 2019లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడికత్తితో దాడి చేశాడు. 5 ఏళ్లు అయినా ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు.అప్పుడంటే జగన్‌కు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకు కుదర్లేదు. ఇపుడు ఖాళీగానే ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మీద హత్యాయత్నం చేసిన నేరస్థుడికి సరైన శిక్ష విధించాలి కదా!. కేసును తక్షణమే విచారించి అమాయకుడు అయిన జగన్‌కు న్యాయం చేయాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని, సీఎంను, డిప్యూటీ సీఎంను, హోం మంత్రిని కోరుతున్నా’’ అని నాగబాబు తెలిపారు.